Site icon TeluguMirchi.com

మ‌హేష్ మ‌సాలా..

maheshసందీప్ కిష‌న్ న‌టించిన అనువాద చిత్రం మ‌హేష్. డింపుల్ చోప‌డా క‌థానాయిక‌. మ‌ద‌న్ కుమార్ ద‌ర్శకుడు. సురేష్ కొండేటి నిర్మాత‌. ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇదో రొమాంటిక్ కామెడీ. మ‌హేష్ అనే పేరు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మ‌హేష్ ఎవ‌రు?? ఈ క‌థ‌కీ అత‌నికీ సంబంధం ఏమిటి? అనే విష‌యాలు ఆస‌క్తిక‌రం. సందీప్ కిష‌న్ ఈ సినిమాలో మాన‌సిక వ్యాధి గ్రస్తుడిగా క‌నిపించ‌నున్నాడు. అత‌ని న‌ట‌న ఈ సినిమాకి హైలెట్ అని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. త‌మిళంలో చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన మ‌హేష్ తెలుగులోనూ విజ‌యం సాధిస్తోంద‌ని నిర్మాత సురేష్ కొండేటి చెబుతున్నారు. అన్నట్టు ఈ సినిమాలో మారుతి హ‌స్తం కూడా ఉందండోయ్‌. ఆయ‌న త‌న వంతుగా కాస్త మ‌సాలా జోడించార‌ట‌. మ‌రి ఈ మహేష్ అందించే మ‌సాలా ఎలా ఉంటుందో…?

Exit mobile version