కృష్ణుడి అవతారం లో మహేష్ బాబు..?

mohanlal-dubbing

శంకర్ – రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ 2 . 0 ‘ నాల్గు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందడం చూసే వామ్మో..అనుకున్నాం. కానీ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించనున్న మహాభారతం చిత్రం ఏకంగా రూ. 1000 కోట్ల తో తెరకెక్కడం ఇప్పుడు అన్ని భాషలు పరిశ్రమల్ని ఆశ్చర్యంలో ముంచేత్తింది.

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా. బి. ఆర్.శెట్టి ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. మహాభారతంలోని అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటైన భీముడి పాత్రను ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ నవల రూపంలో సిద్ధంగా ఉండటం వలన నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టారు దర్శక నిర్మాతలు.

mahesh babu (16)

ప్రపంచ స్థాయి కాస్టింగ్ కంపెనీ ఈ చిత్రం కోసం నటీనటుల్ని ఎంపిక చేస్తోంది. అందులో భాగంగానే ఈ మూవీ లో కృష్ణుడి పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబును అనుకుంటున్నట్లు సమాచారం. మహేష్ తో పాటే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా పరిశీలనలో ఉన్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించనున్న శ్రీకుమార్ మీనన్ మాట్లాడుతూ ఈ సినిమాను 2020 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు.