Site icon TeluguMirchi.com

నవంబర్ 9న మహేష్ – కొరటాల మూవీ..

mahesh-Bharat-Anu-Nenuమురుగుదాస్ దర్శకత్వం లో ‘మహేష్ 23’ చిత్రం చేస్తున్న మహేష్ బాబు , ఈ నెల 9 న కొరటాల మూవీకి ముహూర్తం పెట్టాడని సమాచారం. మహేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల దర్శకత్వం లో మహేష్ చేస్తున్న రెండో చిత్రం. శ్రీమంతుడు సక్సెస్ తో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అన్నప్పటినుండే ఈ మూవీ ఫై అంచనాలు మొదలయ్యాయి.

మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ వంటి వరుస హిట్స్ తర్వాత కొరటాల మహేష్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ ని రెడీ చేసాడట. పొలిటికల్ నేపథ్యం లో ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. మహేష్ బాబు ఈ మూవీ లో సీఎం గా కనిపించబోతున్నాడట. ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలనీ కొరటాల చూస్తున్నాడట. 2017 ఫిబ్రవరి లో ఈ మూవీ సెట్స్ ఫైకి వెళ్లనుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా కాస్ట్ & క్రూ వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.

Exit mobile version