Site icon TeluguMirchi.com

మహేష్ – కొరటాల న్యూ మూవీ లాంచ్..

mahesh-koratal-movie-lunchశ్రీమంతుడు చిత్రం తర్వాత కొరటాల శివ – మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే కొత్త చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. దర్శకుడు కొరటాల శివ , మహేష్ భార్య నమృత , మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ , చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్య తో పాటు అగ్ర నిర్మాతలైన శ్యామ్ ప్రసాద్ రెడ్డి , సురేష్ బాబు మూవీ లాంచ్ కు హాజరయ్యారు. వచ్చే ఏడాది జనవరి లో ఈ మూవీ సెట్స్ ఫైకి రానుంది.

Also Read : మహేష్-కొరటాల మూవీ టైటిల్ అదేనా..?

ప్రస్తుతం మహేష్ బాబు మురగదాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అహ్మదాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తెలుగు , తమిళం లో ఈ మూవీ ఏక కాలం లో తెరకెక్కుతుంది. మహేష్ కు జోడిగా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుండగా , ఖుషి , పులి , నాని చిత్రాల దర్శకుడు ఎస్. జె. సూర్య ఈ మూవీ లో విలన్ గా నటించడం విశేషం, దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో లియో ప్రొడక్షన్స్ N.V.R సినిమా G. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ Pvt. Ltd AR మురగదాస్ ప్రొడక్షన్ సంయుక్తగా ఈ మూవీ నిర్మిస్తున్నారు.

Exit mobile version