భరత్ అనే నేను ప్రీమియర్ షో ఫాన్స్ హంగామా..

సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అసలైన పండగా వచ్చేసింది..గత కొన్ని రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భరత్ అనే నేను ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. అర్దరాత్రి నుండే చాల చోట్ల ప్రీమియర్ షోస్ పడడం తో థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి మొదలు అయ్యింది. వెండి తెర ఫై మహేష్ కనిపించగానే థియేటర్స్ అన్ని ఈలలు మారుమోగిపోయాయి. ఫైట్స్ , పంచ్ డైలాగ్స్ వస్తుంటే థియేటర్ మొత్తం పేపర్స్ తో నిండిపోయింది.

శ్రీమంతుడు తర్వాత మహేష్ – కొరటాల కాంబినేషన్ లో సినిమా రావడం , మొదటి సారి ముఖ్య మంత్రి పాత్రలో మహేష్ కనిపించడం అభిమానులకు పండగను తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రీమియర్ షో కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక పూర్తి టాక్ తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.