సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఎమోషనల్ ట్వీట్ చేసారు . ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. లక్షల సంఖ్య లో హాస్పటల్స్ లలో ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఈ వైరస్ రోజు రోజుకు ఎక్కువ అవుతుండడం తో కేంద్రం సైతం లాక్ డౌన్ తప్ప మరో పద్దతి లేదని తేల్చిసింది.
ఈ నేపథ్యంలో మహేష్ ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ ట్వీట్ చేసారు. ‘‘రెండు వారాల లాక్డౌన్.. మనం శక్తివంతమవుతున్నాం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు ఐక్యంగా చేపట్టిన ప్రయత్నాలను కచ్చితంగా మెచ్చుకోవాలి. కోవిడ్-19పై మనం చేస్తోన్న యుద్ధంలో ముందు వరుసలో నిలబడిన వారందరికీ ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన ఆరోగ్యం కోసం వారు పోరాడుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వీధులు, ఆసుపత్రుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతోన్న ఆ యోధులందరికీ వందనం. వారందరినీ దేవుడు చల్లగా చూడాలి’’ అని మహేష్ తన పోస్ట్‌లో తెలిపాడు. మహేష్ ట్వీట్ కు అంత ఆయన్ను మెచ్చుకుంటున్నారు.
Two weeks of lockdown and we have been going strong. Hugely appreciate the united efforts of our governments?????? This #WorldHealthDay, let's take a moment to thank all those on the frontline of our battle against COVID-19 who ensure we remain in good health.
— Mahesh Babu (@urstrulyMahesh) April 7, 2020