లాక్ డౌన్ లో మహేష్ ఏంచేస్తున్నాడో తెలుసా ..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నడుస్తుండడం తో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో నుండి అత్యవసరమైతే తప్ప కాలు బయటపెట్టడం లేదు. ఇక సినీ నటి నటులైతే లాక్ డౌన్ ను ఫుల్ గా వాడుకుంటున్నారు. ఎప్పుడు సినిమా షూటింగ్ లతో క్షణం తీరక లేకుండా గడిపే వీరు ప్రస్తుతం షూటింగ్ లు బంద్ కావడం తో ఎంచక్కా ఫ్యామిలీ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు.

తన భార్య నమ్రత పిల్లలు సితార గౌతమ్ కృష్ణ లతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకడంతో మహేష్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే నమ్రత తాజాగా ఇంస్టాగ్రామ్ లో మహేష్ , పిల్లలు ఏం చేస్తున్నారో తెలిపింది. మహేష్ పిల్లలు సితార, గౌతమ్ లతో గేమ్స్ ఆడుకుంటున్నారు. అలాగే అన్ని పరిశ్రమలకు చెందిన కొత్త చిత్రాలు, సిరీస్ లు చూస్తున్నారు. దానితో పాటు ఆయన ఇష్టమైన పుస్తకాలు చదువుతున్నారు అని నమ్రత చెప్పుకొచ్చారు.