చిన్నోడు బిజీ బిజీ

maheshbabu‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అదే జోష్ తో విభిన్న లవ్ స్టొరీలు తీసే సుకుమార్ తో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం తదుపరి షెడ్యూల్ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించి గోవా, హైదరాబాద్ లలో షూటింగ్ పూర్తైంది. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దూకుడు చిత్ర నిర్మాతలైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తారని సమాచారం. కృతి సనన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నా ఈ చిత్రానికి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్.