గౌత‌మ్ ఎంట్రీ అయిపోయింద‌ట‌!

mahesh-sonమ‌హేష్‌బాబు ముద్దుల త‌న‌యుడు గౌత‌మ్ కృష్ణ ఎంట్రీ అయిపోయింది. ఈ బుల్లి ప్రిన్స్‌.. మేక‌ప్ వేసుకొని కెమెరా ముందుకొచ్చేశాడు. మ‌హేష్ న‌టిస్తున్న చిత్రం `1`. సుకుమార్ ద‌ర్శకుడు. ఈ సినిమాలో మ‌హేష్ చిన్నప్పటి ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ స‌న్నివేశాల కోసం గౌత‌మ్‌కి కెమెరా ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం భావించింది. దానికి మ‌హేష్ కూడా ఓకే చెప్పేశాడు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. `1` షూటింగ్ ప్రస్తుతం లండ‌న్‌లో జ‌రుగుతోంది. అక్కడ ఆదివారం గౌత‌మ్‌పై స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించార‌ట‌. ఆ స‌మ‌యంలో మ‌హేష్‌, న‌మ్రత‌లు అక్కడే ఉన్నారు. కెమెరా ముందు గౌత‌మ్ క‌ద‌లిక‌లు చూసి మ‌హేష్ థ్రిల్ అయిపోయాడ‌ట‌. మ‌హేష్ కూడా బాల‌న‌టుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సూప‌ర్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు భావి సూప‌ర్ స్టార్ ఎంట్రీ జ‌రిగింద‌న్నమాట‌.