Site icon TeluguMirchi.com

మ‌హేష్ సునామీ.. కాదు!

Mahesh-babuమ‌హేష్‌బాబు-సుకుమార్ సినిమా టైటిల్ పై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఈ సినిమాకి ముందు ‘ఆచార్య’ అనే పేరు పెడ‌దామ‌నుకొన్నారు. ఆ పేరుకి మ‌హేష్ అభ్యంత‌రం చెప్పాడు. ఆ త‌ర‌వాత ‘సునామీ’… వ‌చ్చింది. ఈ పేరు ఖాయ‌మ‌ని అభిమానుల‌తో పాటు, చిత్ర ప‌రిశ్రమ కూడా అభిప్రాయ‌ప‌డింది. అయితే విన‌డానికి బాగానే ఉన్నా ఓ నెగిటీవ్ సెన్స్ ఉంద‌ని… మ‌హేష్ ఈ టైటిల్‌ నీ తిర‌స్కరించ‌డట‌. మూడ‌క్షరాల మ‌రో టైటిల్ పెట్టమ‌ని సూచిండాడ‌ట‌. దాంతో టైటిల్ క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఈనెల 31న సూప‌ర్‌ స్టార్ కృష్ణ జ‌న్మదినం. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్ విడుద‌ల చేస్తారు. దాంతో పాటు సిస‌లైన టైటిల్‌ నీ ప్రక‌టించే అవ‌కాశం ఉంది.

Exit mobile version