Site icon TeluguMirchi.com

ప్రజలకు మహేష్ బాబు విన్నపం


రూమర్స్ కి దూరంగా ఉండని కోరారు మహేష్ బాబు. భయపెట్టే, ఆందోళన కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండమని సూచించారు మహేష్. ”మనమంతా కలిసి ఈ తుపానుతోపాటు ప్రయాణం చేస్తున్నాం. social distancing పాటించడం, పరిశుభ్రంగా ఉండటంతోపాటు మరో ముఖ్య విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదే భయాన్ని దూరంగా ఉంచడం .. ఆందోళన, భయాన్ని కలిగించే వ్యక్తులకు, వార్తలకు దూరంగా ఉండండి. తప్పుడు వార్తలు పెద్ద సమస్యగా మారాయి. తప్పుదారిపట్టించే సమాచారానికి దూరంగా ఉండండి’.ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈ సందర్భంగా మనమంతా ఆరోగ్యంగా ఉండేందుకు కొవిడ్‌-19తో పోరాడుతూ ముందు వరసలో నిల్చున్న వారికి ధన్యవాదాలు చెబుదాం. వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి మన కోసం పోరాడుతున్న యోధులను గౌరవిద్దాం.” అని ట్వీట్ చేశారు మహేష్.

Exit mobile version