120 కోట్ల బడ్జెట్తో నిర్మాణం జరిగిన ఈ సినిమాకు విడుదలకు ముందే 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టార్గెట్ 225 కోట్లుగా తొస్తోంది. తెలుగులో థియేట్రికల్ ద్వారా 100 కోట్లు, తమిళనాడులో విడుదలై అక్కడ 75 కోట్లు వసూళ్లు చేయాని చిత్ర యూనిట్ సభ్యులు టార్గెట్గా పెట్టుకున్నారు.
ఇక మరో 50 కోట్లను ఆన్లైన్ రైట్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా పొందాలని నిర్మాతలు భావిస్తున్నారు. అంటే మొత్తంగా 225 కోట్ల టార్గెట్. ఈ నెంబర్ను సునాయాసంగానే స్పైడర్ దాటేస్తాడు అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.