Site icon TeluguMirchi.com

మహేష్‌బాబు అనుష్కను భయపెట్టిస్తున్నాడు

సూపర్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ముందుగా అనుకున్న సమయానికి షూటింగ్‌ను పూర్తి చేయలేకపోతుంది. ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మొదటగా జూన్‌ 23న విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్‌ ఆలస్యం అవడం వల్ల మహేష్‌ బాబు పుట్టిన రోజు కానుకగా ఆగస్టులో విడుదల చేయాలని భావిస్తున్నారు. అగస్టులో ఏ తేదీన అని అధికారికంగా ప్రకటించలేదు. మహేష్‌ బాబు ‘స్పైడర్‌’ చిత్రం అనుష్క ‘భాగమతి’కి పెద్ద తలనొప్పిగా మారింది.

సైలెంట్‌గా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న అనుష్క ‘భాగమతి’ చిత్రాన్ని అగస్టులో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావించారు. కానీ ఇప్పుడేమో మహేష్‌ ‘స్పైడర్‌’ పోటీకి వస్తున్నాడు. అనుష్క ‘భాగమతి’ మహేష్‌తో పోటీ పడుతున్నాడు. కానీ ‘భాగమతి’ టీం మాత్రం మహేష్‌ను చూసి భయపడుతున్నారు. ఎలాగైనా ‘భాగమతి’ని అగస్టులోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ‘స్పైడర్‌’కు ‘భాగమతి’కి రెండు వారాల విరామం ఉండేలా చూసి తేదీని ఫిక్స్‌ చేయాలని ‘భాగమతి’ యూనిట్‌ ఆలోచనలు చేస్తున్నారు.

Exit mobile version