Site icon TeluguMirchi.com

మహేష్ బాబు ఓ ‘రోగ్’…

Mahesh-Babu-Rogటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఓ ‘రోగ్’..అని మేము అనడం కాదు దర్శకుడు పూరిజగన్నాథ్ అంటున్నాడు..ఇది ఏంటి పూరిజగన్నాథ్ ఇలా అనడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఈ స్టొరీ చదవండి మీకే అర్ధం అవుతుంది..

పూరి,మహేష్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోందని గతకొంతకాలంగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి ‘రోగ్’ అనే టైటిల్ ను పెట్టాలని డిసైడ్ అయ్యాడట పూరి. తన సినిమాలకు ఎప్పుడు వెరైటీ టైటిల్స్ పెట్టే పూరి… ఇప్పుడు మహేష్ తో చేయబోయే ఈ చిత్రానికి రోగ్ అనే టైటిల్ పెడితే బాగుంటుందనుకొంటున్నాడట. గతంలో మహేష్ తో పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి హిట్ చిత్రాలు అందించిన పూరి.. ఇప్పుడు ఈ మూడవ సినిమా రోగ్ ని కూడా హిట్ చేస్తాడని అబిమానులు అంచనాలు పెట్టుకుంటున్నారు.

ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ ఈ రోగ్ చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై నిర్మిస్తున్నారని టాక్. వచ్చే ఏడాది మే నెల్లో ఈసినిమా సెట్స్ పైకి రానుందట. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాదికి గానీ పూర్తి అవుతుంది. అటు పూరి కూడా ఎన్టీఆర్ తో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ కు పూర్తై సంక్రాంతికి రిలీజ్ చేసే పనిలో ఉన్నాడట. ఆ తర్వాత రోగ్ సెట్స్ ఫై రానుంది.

Exit mobile version