సినిమా ట్రైలర్‌లో మహేష్‌బాబు పాత్రపై పూర్తి క్లారిటీ వచ్చింది. మహేష్‌బాబు పాత్ర పేరు శివ. ఎవరికైనా కష్టాల్లో ఉంటే వెంటనే తెలిసిపోయే విధంగా ఆయన కంప్యూటర్‌లో ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరైనా కష్టం అన్నా, ఏడ్చినా కూడా వెంటనే అక్కడ వాలిపోతాడు. అలాంటి పాత్రకు మనుషులను మేకలకంటే హీనంగా చంపుతున్న విలన్ తారసపడతాడు. అప్పుడు శివ ఆ విలన్‌ను ఎలా అంతమొందించాడు అనేది సినిమాగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.