మ‌హేష్ పేరు వాడుకొంటున్న కుర్రహీరో

mahesh-babuనిన్నా మొన్నటి వ‌ర‌కూ యంగిస్థాన్ ప‌వ‌న్ కల్యాణ్ వెంట ప‌డ్డారు. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేకుండా, అంద‌రూ ప‌వ‌న్ టైటిళ్లనూ, పాట‌ల్ని.. విచ్చల విడిగా వాడేసుకొన్నారు. ఇప్పుడు మ‌హేష్ బాబుపై ప‌డ్డారు. మ‌హేష్ బావ సుధీర్ బాబు అత‌డు లోని పాపుల‌ర్ డైలాగ్ ఆడు మ‌గాడ్రా బుజ్జీని త‌న సినిమాకి టైటిల్ గాపెట్టుకొన్నాడు. ఇప్పుడు నాని సినిమాలోని ‘వ‌స్తా నీ వెన‌క’ పాట టైటిల్ అయిపోయింది. నువ్విలా సినిమాతో ఆక‌ట్టుకొన్న కుర్ర హీరో హ‌వీష్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శకుడు. ర‌వితేజతో వీర తీసింది ఈయ‌నే. దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తారు. ఈ చిత్రానికి వ‌స్తా నీ వెన‌క టైటిల్ ఖ‌రారు చేశారు. ఇదో ముక్కోణ‌పు ప్రేమ క‌థా చిత్రమ‌ట‌. డిసెంబ‌రు మొద‌టి వారంలో చిత్రీకర‌ణ మొద‌లుపెడ‌తారు.