తాజాగా విడుదలయిన ‘స్పైడర్’ ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కానీ టైటిల్ విషయమై అభిమానులు కాస్త గాబరా పడుతున్నారు. ఈ టైటిల్ అన్ని వర్గాల ప్రేక్షకులను చేరే విధంగా లేదు. అసలు తెలుగు సినిమా టైటిల్‌లాగే అనిపించడం లేదు. మరీ ప్రేక్షకులకు టైటిల్ కనెక్ట్ కాకపోతే విడుదలయ్యాక ఆ ప్రభావం చాలా ఉంటుంది. అందుకే టైటిల్‌ను మారిస్తే బాగుండు అని మహేష్ అభిమానులు అంటున్నారు. అనేక పేర్లను పరిశీలించాక ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ అభిమానుల నిరాశ గురించి ఆలోచిస్తారా..?? లేదా ఇలాగే కొనసాగిస్తారా అనేది చూడాలి.
‘స్పైడర్’పై అభిమానుల అసంతృప్తి!!
