‘స్పైడర్‌’పై అభిమానుల అసంతృప్తి!!

spyder-firstlook-galleryసూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రాన్ని జూన్‌ 23న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌ ఈ చిత్రంలో ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనుండగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెడికల్‌ స్టూడెంట్‌గా కనిపించనుంది. ఈ చిత్ర టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్‌. టైటిల్‌ విషయమై గందరగోళం ఏర్పడడంతో ఫస్ట్‌లుక్‌ను ఇప్పటి వరకు ఆలస్యం చేస్తూ వచ్చారు. తాజాగా ‘స్పైడర్‌’ ను ఫిక్స్‌ చేసి ఫస్ట్‌లుక్‌ను వదిలారు.

తాజాగా విడుదలయిన ‘స్పైడర్‌’ ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కానీ టైటిల్‌ విషయమై అభిమానులు కాస్త గాబరా పడుతున్నారు. ఈ టైటిల్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను చేరే విధంగా లేదు. అసలు తెలుగు సినిమా టైటిల్‌లాగే అనిపించడం లేదు. మరీ ప్రేక్షకులకు టైటిల్‌ కనెక్ట్‌ కాకపోతే విడుదలయ్యాక ఆ ప్రభావం చాలా ఉంటుంది. అందుకే టైటిల్‌ను మారిస్తే బాగుండు అని మహేష్‌ అభిమానులు అంటున్నారు. అనేక పేర్లను పరిశీలించాక ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన చిత్ర యూనిట్‌ అభిమానుల నిరాశ గురించి ఆలోచిస్తారా..?? లేదా ఇలాగే కొనసాగిస్తారా అనేది చూడాలి.