మహేష్ నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఏ మాయలో…’ అంటూ సాగే పాట లీకయ్యిందట. పాట పల్లవితో పాటు చరణం కూడా కొంత లీకయ్యిందని సమాచారం. అయితే ఈ పాట మహేష్ చిత్రంలోనిదేనా..?? లేదా అనేది ఇంకా అధికారిక సమాచారం లేదు. అంతకు ముందు మహేష్ స్టిల్ లీక్ కాగా ఇటీవలె రకుల్ స్టిల్స్ కూడా లీకయ్యాయి. తాజాగా పాట లీకయ్యింది. అయితే ఈ లీకులు కావాలనే చేస్తున్నారా..?? మరి ఎవరైనా కుట్ర చేస్తున్నారా అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇంతవరకు టైటిల్ గానీ, ఫస్ట్లుక్గానీ విడుద కాకున్నా కూడా ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దాంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా రికార్డు స్ధాయిలో అవుతుంది. ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు.