డేటింగ్‌పై మహేష్‌ హీరోయిన్‌ షాకింగ్ వ్యాఖ్యలు

kriti sanonసూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన సెక్సీ హీరోయిన్‌ కృతిసనన్‌కు  తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇక బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో వరుస చిత్రాలలో నటిస్తున్న ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సుశాంత్‌ సింగ్‌ చాలాకాలం నుండి ప్రేమిస్తున్న అంకిత లొఖండేను కూడా వదిలేశాడు. అంకితతో చాలాకాలంగా ప్రేమలో ఉన్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆమె బాగా మద్యం తీసుకుంటుంది అనే కారణంతో ఇటీవలె బ్రేకప్‌ చెప్పాడు. ఇక సుశాంత్‌ తాజాగా కృతిసనన్‌తో ప్రేమలో ఉన్నాడని బాలీవుడ్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ ఇద్దరు తెగ ఫొటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వైరల్‌ అవుతున్నారు.

తాజాగా మీడియాతో ముచ్చటించిన కృతిసనన్‌ తాను ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నట్టు చెప్పుకొచ్చింది. సుశాంత్‌ సింగ్‌ కేవలం మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పింది. ఇక డేటింగ్‌ చేయడానికి వేరే రంగాలలోని వ్యక్తులకన్నా ఒకే రంగానికి చెందిన వ్యక్తి అయితే అన్ని అర్థం చేసుకుంటాడు అని, అందుకే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో సహజీవనం చేయడానికి అభ్యంతరాలు ఏవి లేవని సంచలన వ్యాఖ్యలు చేసింది. అనుకోకుండా ఆలోచనలు కలిసి ఆ వ్యక్తి మీద అభిప్రాయానికి వస్తాం కానీ ఒక వ్యక్తితో డేటింగ్‌ చేయాలి అని ముందే ప్లాన్‌ చేసుకోలేం, అది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకి తెలియదు, ఒకవేళ ప్లాన్‌ చేసుకుంటే అది ప్రేమకాదు అంటూ కృతి ప్రేమ గురించి చాలా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసింది.