Site icon TeluguMirchi.com

ప్రిన్స్ అతిథిగా….

Mahaesh-Sudheerప్రేమ క‌థా చిత్రమ్‌తో తొలి హిట్ అందుకొన్నాడు కృష్ణ అల్లుడు సుధీర్ బాబు. ఆ సినిమా ఆడియో మ‌హేష్ బాబు చేతుల మీదుగా విడుద‌లైంది. ప్రేమక‌థా చిత్రమ్‌కి మ‌హేష్ బొమ్మ కూడా ప‌బ్లిసిటీగా ఉప‌యోగ‌ప‌డింది. ఇప్పుడు అదే ట్రిక్‌.. ఆడు మ‌గాడ్రా బుజ్జీ సినిమాకీ ప్లే చేయ‌బోతున్నారు. సుధీర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ఆడు మ‌గాడ్రా బుజ్జీ. ఈనెల 30న ఈ చిత్రంలోని పాట‌ల్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మ‌హేష్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేయ‌నున్నారు. కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల కూడా పాల్గొంటారు. మ‌హేష్ ల‌క్కీ హ్యాండ్‌.. మ‌రో హిట్టిస్తే, సుధీర్ బాబుకి అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది..?

Exit mobile version