Site icon TeluguMirchi.com

కారు మెకానిక్ గా మహేష్.. నిజమా ?


మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ చిత్రంలో మహేశ్‌ క్యాబ్‌ డ్రైవర్‌ పాత్రలో కనిపించాడు.ఇప్పుడు ఆయన మెకానిక్ పాత్రలో కనిపిస్తాడని టాక్. వివరాల్లోకి వెళితే.. అర్జున్‌రెడ్డి’ సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా త్వరలోనే మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

మహేష్‌ని దృష్టిలో ఉంచుకొనే ఆయన ఓ కథని సిద్ధం చేసుకొన్నాడని, ఆ కథని కూడా ఇప్పటికే వినిపించాడని, కథ ప్రకారం ఈ సినిమాలో మహేష్ కారు మెకానిక్ గా కనిపిస్తాడని టాక్. ఓ మెకానిక్‌ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని ఈ పాత్రే సినిమాకు కీలకమని వార్తలు వెలువడుతున్నాయి. స్క్రిప్ట్‌ నచ్చడంతో మహేశ్‌ కూడా సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Exit mobile version