Site icon TeluguMirchi.com

తెలుసా…!! రామ్‌చరణ్‌ నాకు బాగా క్లోజ్‌

mahesh babu (16)సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాజాగా ఓ తమిళ మేగజైన్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. మహేష్‌ నటిస్తున్న ‘స్పైడర్‌’ చిత్రాన్ని తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ మరియు టైటిల్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన మహేష్‌ చాలా ఆసక్తికర విషయాలు వెల్లడిరచారు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తరుచుగా మెగా అభిమానులు, సూపర్‌స్టార్‌ అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ తగాదాలు అవుతూనే ఉన్నాయి.

అభిమానుల మధ్య ఇంత గొడవ జరిగినా కూడా హీరోలు మాత్రం చాలా క్లోజ్‌గా ఉంటారు. మహేష్‌ స్వయంగా చిరంజీవి నాకు బాగా దగ్గరి వ్యక్తి, రామ్‌ చరణ్‌ కూడా బాగా క్లోజ్‌ అంటూ చెర్రీ, మహేష్‌ల స్నేహం గురించి చెప్పాడు. అంతేకాకుండా ఇంకా చాలామంది గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్‌ చరణ్‌ ఫ్యామిలి మరియు మహేష్‌ ఫ్యామిలిలు గతంలో ఫారెన్‌ ట్రిప్‌ వేసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా మహేష్‌ ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని చూసి కేవలం తనను రామ్‌ చరణ్‌ ఒక్కడు మాత్రమే అభినందించాడు అని మహేష్‌ తెలిపాడు.

Exit mobile version