సూపర్ స్టార్ మహేష్‌బాబు గత రెండు మూడు సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. మహర్షి చిత్రం విడుదల అయ్యిందో లేదో వెంటనే తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మొదలు పెట్టాడు. అనీల్ రావిపూడి ఈ చిత్రంకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుంది. ఇదే సమయంలో మహేష్‌బాబు మరో సినిమాకు కమిట్ అయినట్లుగా సమాచారం అందుతోంది. తనకు మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడితోనే మహేష్ మరోసారి సినిమా చేయబోతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 25వ చిత్రం మహర్షి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో మంచి వసూళ్లను నమోదు చేసింది. అందుకే వంశీతో మంచి సన్నిహిత్యం ఏర్పడింది. మరోసారి ఆయనతో సినిమా చేయాలని మహేష్ నిర్ణయించుకున్నాడు. తన 27వ చిత్రాన్ని ఆయన దర్శకత్వంలో చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది.
ప్రముఖ హిందీ చిత్ర నిర్మాణ సంస్థ సోనీ వారు ఈ చిత్రంను నిర్మించబోతున్నాడు. మహేష్‌బాబు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉండబోతున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభించి వచ్చే ఏడాది దసరా వరకు విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.