Site icon TeluguMirchi.com

టీజర్ టాక్ : మహానటి

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించికున్న నటి సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తిసురేష్‌ టైటిల్‌రోల్‌ పోషిస్తుండగా, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు.

ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఉరుములు.. మెరుపుల శబ్దంతో టీజర్ ప్రారంభమైంది. ‘అన.. అనగ.. అనగగ.. అనగనగా ఒక మహానటి’ అంటూ టైప్‌ చేస్తూ.. డైలాగ్‌ను వినిపించారు.
తొలి ఫ్రేమ్‌ నుంచీ సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ చక్కగా ఒదిగిపోయారు. నవ్వు, నడక, హావభావాలు ఆమెలానే పలికించారు. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Exit mobile version