వైజయంతి మూవీస్ బేనర్‌పై ప్రియాంక దత్, స్వప్నా దత్ నిర్మాణంలో మహానటి సావిత్రి జీవిత కథను మూడు సంవత్సరాలు పాటు పరిశోధన చేసి తెరపై ” మహానటి ” దృశ్యకావ్యాన్ని చూపించాడు నాగ్ అశ్విన్. మే 9న విడుదలైన మహానటి, తెలుగు, తమిళ భాషల్లో మహిళ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా భారీ విజయం సాధించి ఔరా అనిపించింది. ఈ మూవీ ఇటీవల వంద రోజుల పూర్తి చేసుకుంది.
వెండితెరపై ఎంతటి భారీ విజయన్నీ అందుకుందో, ఇప్పుడు బుల్లి తెరపై కూడా అంతటి భారీ విజయన్నీ అందుకుంది. గత వారం( ఆగస్ట్ 19న) బుల్లితెరపై మహానటి మూవీ ప్రసారం అయింది. ఈ చిత్రం బుల్లితెరపై కూడా రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధించి ఆశ్చర్యపరచింది.
తాజా సమాచారం ప్రకారం మహానటి మూవీ 20.16 టీఆర్పీ సాధించిందని చెబుతున్నారు. బాహుబలి తర్వాత అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా మగధీర (22.0), బాహుబలి (21.84), ఫిదా (21.30), శ్రీమంతుడు (21.24) ఉన్నాయి. వీటి తర్వాతి స్థానం మహానటికే దక్కిందని అంటున్నారు