Site icon TeluguMirchi.com

“మగధీర” రీరిలీజ్.. ఎప్పుడంటే ?


టాలీవుడ్ లో ఇప్పుడు రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ‘పోకిరి’, ‘జల్సా’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఖుషి’ వంటి సినిమాలు రీరిలీజ్ లోనూ అదిరిపోయే కలెక్షన్స్ తో సత్తా చాటాయి. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించిన ‘మగధీర’ కూడా రీరిలీజ్ కానుంది. గత కొన్నాళ్ల నుంచి ఈ టాక్ ఉన్నప్పటికీ ఇప్పుడు అయితే ఈ సినిమా పై ఆ అధికారిక అప్డేట్ వచ్చింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చ్ 27కి రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారు తెలిపారు. ఇక 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ చిత్రం మరోసారి భారీ వసూళ్లతో రీరిలీజ్ సినిమాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

Exit mobile version