Site icon TeluguMirchi.com

బిగ్ బీకి ‘మాస్ట్రో అవార్డు’

amitabబాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను ఖాతాలోకి మరో అవార్డు వచ్చి చేరింది. తాజాగా, బిగ్ బీని విజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ మాస్ట్రోఅవార్డు వరించింది. అమితాబ్ తో పాటుగా.. ప్రముఖ వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ వాద్య దిగ్గజం పండిట్ శివకుమార్ శర్మలకు కూడా ఈ అవార్డు వచ్చింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుభాష్ ఘయ్ కి చెందిన ఫిల్మ్ అండ్ మీడియా సంస్థ ఈ అవార్డును ఈ త్రిమూర్తులకు బహూకరించింది. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు భవిష్యత్తు ఆశాకిరణాలుగా ఉన్న యువ కళాకారులను కలుసుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సుభాష్ ఘయ్ సంస్థలో శిక్షణ పొందిన 200 మందికి ఈ సందర్భంగా పట్టాలు అందించారు. నటులు, దర్శకులు, స్క్రీన్ ప్లే రచయితలలోని నైపుణ్యాలను వెలికి తీస్తున్నందుకు ఈ సంస్థను బిగ్ బీ అభినందించారు.

Exit mobile version