Site icon TeluguMirchi.com

మధురిమా! ఇదేం తి(లు)క్కమ్మా ?

madhurimaవంశీ ‘సరదాగా కాసేపు’ చిత్రంలో అచ్చమైన పల్లెటూరి తెలుగమ్మాయి గా కనిపించిన మధురిమ తాజాగా షాడో చిత్రంలో శ్రీకాంత్ సరసన మోడరన్ గర్ల్ గా దర్శనమివ్వబోతుంది. ఇది ఇలా వుంచితే.. ఈ పొడుగు కాళ్ళ సుందరి తాజాగా ఓ వివాదంలో చిక్కినట్లు కనిపిస్తుంది. ఇటీవల పూజ కపూర్ ఆర్ట్ డి అరహంత్
పేరిట ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ షోలో మ్యూస్ ఆర్ట్ గ్యాలరీ వద్ద హాట్ హాట్ అందాలతో కుర్రకారును మత్తెకించే క్యాట్ వాక్ చేసింది మధురిమ. ఈ ఎగ్జిబిషన్ లో మధురిమ కొత్త లుక్ తో కట్టిపడేసింది. మునుపటి కంటే కైపెక్కించే కళ్ళతో కనువిందు చేసింది. ఇదంతా బాగానే వుంది. అసలు వివాదం ఎక్కడంటారా.. షో చూస్తున్న కొంత మంది దృష్టి మధురిమ పై కాకుండా ఆమె వేసుకున్న దుస్తులపైకి మళ్ళింది. అమ్మడు వేసుకున్న డ్రెస్ పై బుద్దుడి రూపం ఎంబ్రాయిడరీ వర్క్‌ వుండడం చూసిన అందరు ఒకింత ఆవేశం, ఆశ్చర్యానికి గురైయ్యారు. అసలు పవిత్ర మైన బుద్దుడి రూపం క్యాట్ వాక్ చేసే డ్రెస్ పై రూపొందిచాలని ఎలా అనిపించిందో, వేశారు సరే.. అసలు ఏమాత్రం విచక్షణ లేకుండా అలాంటి దుస్తులను ధరించాలని మధురిమకు ఎలా అనిపించిందో అర్ధం కావటం లేదు. ఈ షో చూసిన వారు ఇప్పటికే కసురుకుంటున్నారు. ఈ వివాదం ఎటు దారితీస్తుందో, మధురిమకు ఎలాంటి అనుభవాన్నిస్తుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version