Site icon TeluguMirchi.com

హద్దు మీరొద్దు అని ధనుష్‌కు వార్నింగ్‌ ఇచ్చిన హీరోయిన్‌

madonna sebastianసూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అల్లుడు, కోళీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌కు ఈ మధ్య చాలా వివాదాల చుట్టుముడుతూ ఉన్నాయి. ఒకవైపు తల్లిదండ్రుల విషయమై కోర్టులో చాలా పెద్ద చర్చ జరుగుతుండగా మరోవైపు సుచి లీక్స్‌లో ధనుష్‌కు పెద్ద చిక్కు వచ్చి పడిరది. అంతకాకుండా ధనుష్‌ క్యారక్టర్‌పై చాలామందికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇలా వివాదాలతో సతమతమవుతున్న ధనుష్‌కు తాజాగా మరో చిక్కు వచ్చి పడిరది. స్టార్‌ హీరో ధనుష్‌కు కుర్ర హీరోయిన్‌ మడొన్నా సెబాస్టియన్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిందట. అయితే ఈ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అనేటి మాత్రం బయటకు పొక్కడం లేదు కానీ పెద్ద వార్‌ జరుగుతున్నట్టే సమాచారం అందుతోంది.

మడొన్నా ధనుష్‌కు హద్దు మీరొద్దు, మర్యాదగా ఉండదు, జాగ్రత్త… అంటూ మెసేజ్‌ పెట్టిందట. అయితే ఇది ఏ విషయంలో అనేది మాత్రం సమాచారం లేదు. ధనుష్‌ తొలిసారిగా తెరకెక్కించిన ‘పవర్‌ పాండి’ చిత్రంలో మడొన్నా నటించింది. అయితే ఆ సమయంలో ధనుష్‌ హీరోయిన్‌తో కాస్త అసభ్యకరంగా ప్రవర్తించడంతో మడొన్నా చాలా సీరియస్‌ అయ్యిందట. ఆ విషయం రహస్యంగా పెద్ద ధుమారమే రేపుతుంది. ఆ సమయంలోని ఘటనను దృష్టిలో ఉంచుకునే మడొన్నా ధనుష్‌కు ఇలాంటి వార్నింగ్‌ మెసేజ్‌ పెట్టినట్టు కోళీవుడ్‌ మీడియా ద్వారా తెలుస్తోంది.

Exit mobile version