Site icon TeluguMirchi.com

మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఎటాక్ టీజర్ రిలీజ్

వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే మూవీ చేస్తున్నాడు. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న తరుణంలో ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ లో మొత్తం యాక్షన్ పార్ట్ నే చూపించారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందిస్తున్నారు.

Macherla Niyojakavargam First Attack | Nithiin | Krithi Shetty | Raja Shekhar | Mahathi Swara Sagar

Exit mobile version