మాచెర్ల నియోజకవర్గం మూవీ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసాడు. నితిన్ – కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ తరుణంలో డైరెక్టర్ కొన్ని కులాలను ఉద్దేశించి ట్వీట్లు పెట్టినట్టు ఫేక్ న్యూస్ సృష్టించి ఆన్‌లైన్‌లో వైరల్ చేస్తున్న నేపథ్యంలో..ఈ మూవీ డైరెక్టర్ అండ్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, నిర్మాత సుధాకర్ రెడ్డి టీంహైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పుకార్లు సినిమాకు ఇబ్బంది కలిగించడమే కాకుండా.. తన వ్యక్తిగత కెరియర్‌కు తీరని నష్టం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ ట్వీట్లు ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.