Site icon TeluguMirchi.com

Maa Oori Polimera 2 : ఓటీటీలోకి ‘మా ఊరి పొలిమేర 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?


సత్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రల్లో, అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మా ఊరి పొలిమేర-2’. మూఢనమ్మకాలు, చేతబడుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా మొదటి భాగం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజై ఊహించని రెస్పాన్స్ సంపాదించుకుంది. ఈ సినిమాకి సీక్వెల్‍గా వచ్చిన ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది.

‘మా ఊరి పొలిమేర 2’ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ఆహా లో డిసెంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్‍ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. అయితే ఆహా గోల్డ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రం 24 గంటల ముందుగానే అంటే డిసెంబర్ 7నే ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఇక గౌరీ కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి గ్యానీ సంగీతం అందించారు.

Exit mobile version