రిపోర్ట్: సెప్టెంబర్ వరకూ లాక్ డౌన్ ?


బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ అమెరికన్ అధ్యయన సంస్థ దేశంలో లాక్ డౌన్ పరిస్థితులపైనా సంచలన రిపోర్టును వెల్లడించింది. భారత్‌లో సెప్టెంబర్ వరకూ లాక్ డౌన్ ఎత్తేయడం సాధ్యం కాదని.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేసింది.

ఆర్థిక సంవత్సరంలో.. ఆరు నెలల పాటు.. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోనే ఉంటుందని.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూస్తే… సడలింపులుకూడా సాధ్యం కావని.. జూన్ మధ్య కాలంలోనే… లాక్ డౌన్ సడలింపులు ప్రారంభిస్తారని.. సెప్టెంబర్ మధ్య కాలంలో లాక్ డౌన్ ఎత్తివేయడానికి అవకాశం ఉంటుందని బోస్టన్ గ్రూప్ అంచనా వేసింది.