కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలనంత ఇంటికే పరిమితం కాగా అన్ని సంస్థలు మూతపడ్డాయి. వీటిలో చిత్ర పరిశ్రమ కూడా ఉంది. కోట్ల రూపాయిలు పెట్టి సినిమాలు చేసిన నిర్మాతలు అవి రిలీజ్ కాకుండా ల్యాబ్ కే పరిమితం కావడం..షూటింగ్స్ మధ్య లోనే ఆగిపోవడం తో నిర్మాతలు తలలు పట్టుకున్నారు.
ప్రస్తుతం నష్టాల నుండి బయటపడేందుకు సరికొత్త ఆలోచన చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో రిలీజ్ కావల్సిన నాని వి చిత్రం, వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం , రామ్ రెడ్ చిత్రాలను ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. థియేటర్స్‌లో రిలీజ్ చేయడం కంటే ముందు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలు అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే బయ్యర్లకు భారీ నష్టాలూ వాటిల్లడం ఖాయం. డిజిటల్ స్ట్రీమింగ్ లలో వచ్చిన తర్వాత ఎవరు కూడా థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడరు. మరి నిజంగా ఇలా చేస్తారా లేదా అనేది చూడాలి.