Site icon TeluguMirchi.com

గర్భవతి అయినా కూడా ఏంటి ఈ పిచ్చి వేశాలు

Lisa Haydon 1మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన ‘రచ్చ’ చిత్ర టైటిల్‌ సాంగ్‌లో తన అందాలతో కనువిందు చేసిన లీసా హెడెన్‌ గుర్తుందా. ఈ అమ్మడు తన భాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న మూడు నెలకే గర్భవతి అయ్యింది. ఈ అమ్మడికి గర్భం పెళ్లికి ముందే వచ్చిందని ఒక టాక్‌ ఉంది. ఈ అమ్మడు ప్రస్తుతం 8వ నెల గర్భవతి. గతంలో హీరోయిన్‌లు గర్భం దాల్చగానే ఇక సినిమాలకు, మీడియాకు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. గర్భంతో కూడా హాట్‌ ఫొటో షూట్‌లతో హీరోయిన్‌లు రెచ్చిపోతున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌లు అయితే మరీను. కరీనా కపూర్‌ కూడా 15రోజుల్లో బాబుకు జన్మన్విడుతుండగా కూడా హాట్‌ ఫొటోలతో రెచ్చగొట్టింది.

తాజాగా లీసా హెడెన్‌ కూడా గర్భంతో ఉన్న ఫొటోతో తెగ హల్చల్‌ చేస్తోంది. అయితే ఈ అమ్మడు కేవలం కడుపుతోనే ఫొటో దిగలేదు. న్యూడ్‌గా ఉండి మరీ కడుపును చూపిస్తూ మిగతాదంతా కూడా కవర్‌ చేసి మరీ ఫొటో దిగింది. బాత్‌ టబ్‌లో సుతారంగా పడుకుని చేతిలో ఓ మేగజైన్‌ పట్టుకుని అందాలన్నీ కూడా సబ్బు నురగతో కవర్‌ చేసుకుని కేవలం తన పొట్ట వరకే కనిపించేలా క్లిక్‌ మనిపించుకుంది. ఇదేదో సరదా చేసుకుని గమ్మున ఉండక దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతుంది. కొందరు ఈ ఫొటో చూసి సంబర పడుతుంటే మరికొందరు మాత్రం గర్భవతి అయ్యాక కూడా ఏంటి ఈ పిచ్చి వేశాలు అంటూ విమర్శిస్తున్నారు.

Exit mobile version