Site icon TeluguMirchi.com

లయన్ మూవీ అదిరిపోయే డైలాగ్స్…

lion-dilaguesలెజెండ్ చిత్రం తార్వత నట సింహ బాలకృష్ణ నుండి వస్తున్న తాజా చిత్రం ‘లయన్’. ఈ చిత్ర డైలాగ్స్ అంటూ సోషల్ మీడియా లో కొన్ని డైలాగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకి ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్ వెయ్యండి…

సుమోలతో సవారి చేయ్యించుకుంటవో….
బాంబులతో బ్లాస్టింగ్ లే చేయ్యించుకుంటవో….
బచ్చానా కొడుకులతో లుచ్చ ఆటలే ఆడుకుంటవో ఆడుకో…
ఎక్కడయినా, ఎప్పుడయినా …
కబడ్డీ..కబడ్డీ.. ఆడటానికి నేను రెడీ..నువ్వు రెడీనా…

వచ్చే ముందు ఒక్కసరియిన ఆలోచించుకో..
వీడి దగ్గరికి పోవచ్చ అని..
చచ్చే ముందు వంద సార్లు ఆలోచించు..
వీడి దగ్గరికి ఎందుకోచ్చాన అని…
రేయ్ వేటకు వెళ్ళేటప్పుడు సింహం అడుగుల్లో చప్పుడు ఉండదు..
ఈ లయన్ వేటస్తే నీ మొండెం మీద తల ఉండదు జాగ్రత్త….

ఇలా ఈ పవర్ ఫుల్ డైలాగ్స్ మీడియా లో ప్రచారం జరుగుతున్నాయి. ఇంతకి ఈ డైలాగ్స్ సినిమా లో ఉన్నాయో లేవో తెలియదు కానీ అభిమానులకు మాత్రం ఈ డైలాగ్స్ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి . ఇక ఈ చిత్రానికి విషయానికి వస్తే బాలకృష్ణ సరసన త్రిష , రాధిక ఆప్టే నటిస్తున్నారు. సత్య దేవా అనే వ్యక్తి నూతన దర్శకుడిగా వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు.

Exit mobile version