Site icon TeluguMirchi.com

లయన్ ఫస్ట్ డే కలెక్షన్స్

LION-Collections2నటసింహం బాలకృష్ణ నటించిన ‘లయన్’ భారీ అంచనాల నడుమ నిన్న విడుదలయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్టం లో లయన్ కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. బాలకృష్ణకి మాస్ ఇమేజ్ ఉన్న అన్ని ఏరియాల్లో మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ వాసులు చేస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇక గుంటూరులో బాలకృష్ణకి ఫ్యాన్ ఎక్కవని మనం చెప్పనక్కరలేదు. మొదటి రోజు లయన్ సినిమాకి రికార్డ్స్ బ్రేక్ చేసే కలెక్షన్స్ వచ్చాయని సినీ ప్రముఖులు చెపుతున్నారు. మొదటి రోజు గుంటూరులో 72 లక్షల షేర్ ని సాధించింది. రెండవ రోజు కూడా అదే రేంజ్ కలెక్షన్స్ తో కోటి రూపాయల మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా ఓవరాల్ గా రెండు కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సత్య దేవ నూతన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. బాలయ్య కు జంటగా త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ మంచి సంగీతం అందించాడు.

Exit mobile version