Site icon TeluguMirchi.com

లైగర్ కు టికెట్ ధరలు భారీగా పెంచారు

మొన్నటి వరకు సినిమా టికెట్ ధరలు భారీగా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు రాలేకపోయారు. రెండు వారాలుగా సినిమా టికెట్ ధరలు తగ్గించడం..విడుదలైన చిత్రాలు కూడా బాగుండడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెట్టారు. దీంతో అంత హ్యాపీ గా ఉన్నారు. ఇక ఇప్పుడు మళ్లీ బాదుడు కార్యక్రమం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా గా రాబోతుండడం..పూరి డైరెక్ట్ చేస్తుండడం..మూడేళ్ళ తర్వాత విజయ్ నుండి సినిమా వస్తుండడం తో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ తరుణంలో సినిమా టికెట్ ధరలు అమాంతం పెంచి ప్రేక్షకుల ఫై భారం మోపారు.

సినిమా టిక్కెట్ ధరలు (GSTతో సహా) పరిశీలిస్తే.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ – రూ.175 .. మల్టీప్లెక్స్ల్లో – రూ.250 వరకూ టికెట్ ధరను పెంచారు. ఇటీవలి కాలంలో విడుదలైన ఏ తెలుగు సినిమాల్లో అన్నిటికంటే ఇదే అత్యధికం. అయితే ఏపీలో టిక్కెట్ ధరలు సాధారణంగానే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ కు రూ.147.. మల్టీప్లెక్స్ కు రూ.177గా ఉంది. నైజాంలో టికెట్ ధరల పెంపుపై నెటిజనులు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. లైగర్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాబట్టి ఇక్కడ టిక్కెట్ ధరల పెంపును తీవ్రంగా నిరశిస్తున్నారు. మరి ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ల ఫై ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.

Exit mobile version