లైగర్ డిజాస్టర్ కావడానికి ఆ ఐదు కారణాలేనా..?

లైగర్ ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. పూరి – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కి తెలుగు తో పాటు హిందీ లోను మంచి పాపులార్టీ ఉండడం తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లోను రిలీజ్ చేసారు. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం అయ్యింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్, రమ్యకృష్ణ లు కీల‌క పాత్ర‌లో నటించారు. ముందు నుండి సినిమా ఫై అంచనాలు భారీగా ఉండడంతో ..ఆ అంచనాలను అందించడం లో పూరి విఫలమయ్యాడు. దీంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరు డిజాస్టర్ అని చెపుతూ వస్తున్నారు. సినిమా ప్లాప్ కావడానికి ప్రధానంగా ఆ ఐదు కారణాలే అని చెపుతున్నారు.

ఆ ఐదు కారణాలు ఏంటి అంటే..

* ప్రమోషన్స్ లలో విజయ్ చేసిన హడావిడి

* తల్లి పాత్ర

* విజయ్ రోల్ కు నత్తి పెట్టడం

* హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్ లేకపోవడం

* మ్యూజిక్ వీటికి తోడు స్క్రీన్ ప్లే , కామెడి లేకపోవడం , మైక్ టైసన్ ను వాడుకోలేకపోవడం ఇవన్నీ కూడా సినిమా ను ప్లాప్ చేశాయని అంటున్నారు.