లైగర్ ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. అయినప్పటికీ ఫస్ట్ డే మాత్రం వసూళ్ల సునామి సృష్టించింది. పూరి – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కి తెలుగు తో పాటు హిందీ లోను మంచి పాపులార్టీ ఉండడం తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లోను రిలీజ్ చేసారు. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం అయ్యింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, రమ్యకృష్ణ లు కీలక పాత్రలో నటించారు. ముందు నుండి సినిమా ఫై అంచనాలు భారీగా ఉండడంతో మొదటి రోజు ప్రేక్షకులు బ్రహ్మ రథంపట్టారు. దీంతో విడుదలైన ప్రతి సెంటర్ లో వసూళ్ల వర్షం రాబట్టింది.
ఫస్ట్ డే వసూళ్లు చూస్తే..
నైజాంలో రూ. 4.24 కోట్లు, సీడెడ్లో రూ. 1.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 83 లక్షలు, కృష్ణాలో రూ. 48 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో.. రూ. 9.57 కోట్లు షేర్, రూ. 15.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు రూ. 9.57 కోట్లు షేర్ వచ్చింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 55 లక్షలు, ఓవర్సీస్లో రూ. 2.56 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 55 లక్షలు, మిగిలిన భాషల్లో రూ. 22 లక్షలు వసూలైంది. వీటితో కలిపి మొదటి రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.45 కోట్లు షేర్, రూ. 24.30 కోట్లు గ్రాస్ సాధించింది. కానీ సెకండ్ చాల చోట్ల డ్రాప్ అయినట్లు సమాచారం అందుతుంది.