బ్రేకప్‌ తర్వాత సన్నబడ్డ ఇల్లీబేబి

చిట్టి నడుముతో కుర్రకారుని అతలాకుతలం చేసిన ఇలియానా చాలాకాలంగా ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్నది. ఫొటోగ్రాఫర్‌ అయిన ఆండ్రూ ఈ అమ్మడు చాలా గాఢంగా ప్రేమలో మునిగి తేలింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య బ్రేకప్‌ అయ్యింది. ఈ విషయాన్ని గోవా బ్యూటీ సోషల్‌ మీడియాలో పబ్లిక్‌గా షేర్‌ చేసింది. ఇల్లీ బేబీ ఆ మధ్య లావుగా తయారయింది. అప్పట్లో ఉందా లేదా అనే నడుముతో జీరో సైజ్‌లో ఉన్న ఇల్లీ లావు అవడంతో ఆమె అభిమానులు చాలా నిరాశపడ్డారు. అంతేకాకుండా ఈ అమ్మడికి అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు.

బ్రేకప్‌ తర్వాత చీకుచింతా లేకుండా ఉండి, ఫిజిక్‌పై దృష్టి పెట్టినట్టుంది. అందుకే ఈ అమ్మడు ఇటీవల కాస్త సన్నబడ్డది. మళ్లీ మునుపటిలా మారాలని ఇల్లీ కసరత్తులు చేస్తున్నట్టుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లీ సన్నగా, ముద్దుగా దర్శణం ఇచ్చింది. దాంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలను చేస్తోంది. మరిన్ని ఆఫర్ల కోసం మళ్లీ ఫిజిక్‌ని కండీషన్‌లో పెట్టడానికి ఇల్లీ ప్లాన్‌ చేసినట్టుంది. ఈ ఫొటోకే అందుకు నిదర్శణం.