లెజెండ్ ఫిబ్ర‌వ‌రిలో??

Balakrishna-legend2014లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల కోసం త‌న అస్ర్తాల‌ను సిద్ధం చేసుకొంటున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌.  త‌న సినిమా లెజెండ్‌ ని ఎన్నిక‌ల‌కు ముందు విడుద‌ల చేసి – త‌న స్టామినాని నిరూపించుకోవాల‌నుకొంటున్నాడు. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. వారాహి చ‌ల‌న చిత్ర‌, 14 రీల్స్ ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోనాలీ చౌహాన్‌, రాధికా ఆప్టే క‌థానాయిక‌లు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేద్దాం అనుకొన్నారు. అయితే ఎన్నిక‌ల‌కు చాలా ముందుగా సినిమా వ‌చ్చిన‌ట్టవుతుంది. అందుకే కాస్త ఆగి.. త‌న బాణాన్ని వ‌ద‌లాల‌నేది బాల‌య్య ఆలోచ‌న‌. లెజెండ్‌ లో రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలు పొందు ప‌ర‌చార‌ట‌. ఈ సినిమాని త‌న ప్ర‌చారం కోసం వాడుకోవాల‌నేది బాల‌య్య ప్లాన్‌. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమాలో పొలిటికల్ మ‌సాలా ద‌ట్టిస్తున్నాడ‌ట బోయ‌పాటి. చూద్దాం.. లెజెండ్ సంధించే ఈ అస్త్రం ల‌క్ష్యాన్ని ఛేధిస్తుందో లేదో..?