అయితే ఇప్పుడు లెజెండ్ సినిమాకు పోటీగా ‘రౌడీ’ సినిమాను రిలీజ్ చేయనున్నారట. వర్మ దర్శకత్వంలో మంచు హీరోలు మోహన్ బాబు, విష్ణులు నటించిన ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. దీనికి సంబందించి ఇప్పటికే ప్రెస్ నోటును కూడా రిలీజ్ చేశారు. వర్మ దర్శకత్వంలో శరవేగంగా పూర్తి చేసుకున్న ఈసినిమాపై ముందుగా పెద్ద అంచనాలు లేకపోయినా కానీ ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో క్రేజ్ వచ్చింది. మార్చి 28న ఉగాది కావడంతో ఆ రోజులు క్యాష్ చేసుకోవాలని ఈ ఇద్దరూ ఆశపడుతున్నారు.రౌడీ మూవీపై రామ్ గోపాల్ వర్మ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే లెజెండ్ మూవీ సక్సెస్ కూడ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు కీలకంగా మారింది.
పోటీ వాతావరణంలో రిలీజ్ అవుతున్న ఈ రెండు మూవీల రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంతో అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం ఆసక్తిని కనబరుస్తుంది. అయితే రెండు మాస్ సినిమాలే కావడంతో ఒకరు తగ్గడమే బెటరంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ముందుగా డేట్ ఫిక్స్ చేసుకున్న లెజెండ్ కు రౌడీ సైడ్ ఇస్తాడో లేదో చూడాలి!