‘రౌడీ’ వెనక్కి తగ్గుతాడా ??

mohan babuనందమూరి నటసింహం బాలకృష్ణ లెజెండ్ తో మరోసారి జూలు విదిల్చడానికి రెడీ అయ్యాడు. మార్చి 28న థియేటర్లో రావడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. లెజెండ్ బాలయ్య కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌ అవుతుందని..మరోసారి బాక్స్ ఆఫీస్ ను కుమ్మేయడం ఖాయమని టాక్ నడుస్తుంది.

అయితే ఇప్పుడు లెజెండ్ సినిమాకు పోటీగా ‘రౌడీ’ సినిమాను రిలీజ్ చేయనున్నారట. వర్మ దర్శకత్వంలో మంచు హీరోలు మోహన్ బాబు, విష్ణులు నటించిన ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. దీనికి సంబందించి ఇప్పటికే ప్రెస్ నోటును కూడా రిలీజ్ చేశారు. వర్మ దర్శకత్వంలో శరవేగంగా పూర్తి చేసుకున్న ఈసినిమాపై ముందుగా పెద్ద అంచనాలు లేకపోయినా కానీ ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో క్రేజ్ వచ్చింది. మార్చి 28న ఉగాది కావడంతో ఆ రోజులు క్యాష్ చేసుకోవాలని ఈ ఇద్దరూ ఆశపడుతున్నారు.రౌడీ మూవీపై రామ్ గోపాల్ వర్మ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే లెజెండ్ మూవీ సక్సెస్ కూడ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు కీలకంగా మారింది.

పోటీ వాతావరణంలో రిలీజ్ అవుతున్న ఈ రెండు మూవీల రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంతో అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం ఆసక్తిని కనబరుస్తుంది. అయితే రెండు మాస్ సినిమాలే కావడంతో ఒకరు తగ్గడమే బెటరంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ముందుగా డేట్ ఫిక్స్ చేసుకున్న లెజెండ్ కు రౌడీ సైడ్ ఇస్తాడో లేదో చూడాలి!