Site icon TeluguMirchi.com

తొలిరోజు రూ.9.5 కోట్లు

legend-first-week-collectiolబాల‌య్య బాక్సాఫీసు ద‌గ్గ‌ర ప్ర‌తాపం చూపించ‌డం మొద‌లెట్టేశాడు. సింహా కాంబినేష‌న్లో వ‌చ్చిన ‘లెజెండ్’ స‌రికొత్త రికార్డుల దిశ‌గా బోణీ కొట్టింది. శుక్ర‌వారం థియేట‌ర్ల‌న్నీ… జాత‌ర్ల‌ను త‌ల‌పించాయి. బాల‌య్య వీర‌విహారం చూడ్డానికి అభిమానులు క్యూ క‌ట్టారు. దాంతో తొలి రోజు రూ.9.5 కోట్ల వ‌సూళ్లు ద‌క్కాయి. నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌ లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్‌! ఈమ‌ధ్య కాలంలో ఇన్ని వ‌సూళ్లు దక్కించుకొన్న సినిమా కూడా లేదు. గురువారం కొన్ని చోట్ల ప్రీమియ‌ర్ షోలు వేయ‌డం వ‌ల్ల‌.. వ‌సూళ్లు మ‌రిన్ని పెరిగాయి. అవ‌న్నీ క‌లుపుకొని ఆంధ్రా, సీడెడ్‌, నైజాంల‌లో ఆరున్న‌ర కోట్లు వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్‌ లో అర‌కోటి వ‌చ్చాయి. మిగ‌తా రాష్ట్ర్లాల‌లో కోటి రూపాయ‌ల దాకా క‌లెక్ష‌న్లు ద‌క్కాయి. మొత్తానికి తొమ్మిదిన్న‌ర కోట్ల‌గా లెక్క‌తేలింది. సోమ‌వారం నాటికి ఈ సినిమా రూ.30 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు లెక్క‌లు వేసుకొంటున్నారు. సోమ‌వారం ఉగాది రూపంలో అద‌న‌పు సెల‌వు క‌లిసొచ్చింది. లెజెండ్ కు అన్ని విధాలా మంచి శ‌కున‌ములే.

Exit mobile version