ఎన్టీఆర్‌ని దాట‌లేక‌పోయాడు

ntr-and-balayya

 

లెజెండ్ జోరు చ‌ప్ప‌బ‌డిపోయింది. తొలి రెండు వారాలూ.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌న హ‌వా చూపించిన బాల‌య్య.. రేసుగుర్రం ధాటికి బాగా త‌గ్గాడు. రూ.50 కోట్ల క్ల‌బ్‌ లో చేర‌డం ఖాయం అనుకొన్న నంద‌మూరి అభిమానుల్ని నిరాశ ప‌రిచాడు. ఈ సినిమా తొలి మూడు వారాల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.36 కోట్లు వ‌సూలు చేసింది. క‌నీసం న‌ల‌భై కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం కూడా క‌ష్ట‌మే అనిపిస్తోంది. నంద‌మూరి హీరో సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేర‌లేదు. బాద్‌ షా రూ.45 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఈసారి లెజెండ్ రూ.50 కోట్ల క్ల‌బ్‌ లో చేరుతుంద‌ని బాల‌య్య ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకొన్నారు. క‌నీసం ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేయ‌డం ఖాయం అనుకొన్నారు. కానీ రెండూ జ‌ర‌గ‌లేదు. ఎన్టీఆర్ రికార్డ్ భ‌ద్రంగా ఉంది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ‌మ్మ‌య్య అనుకొంటున్నారు. బాల‌య్య నుంచి మ‌రో సినిమా రావ‌డానికి ఇంకా టైమ్ ప‌డుతోంది. ఈలోగా ర‌భ‌స వ‌చ్చేస్తాడు. నంద‌మూరి హీరో సినిమాని రూ.50 కోట్ల క్లబ్‌ లో చేర్చే స‌త్తా ఆ సినిమాకే ఉంద‌ని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.