నందమూరి బాలకృష్ణ హవా ఇక్కడే కాదు… విదేశాల్లోనూ కొనసాగుతోంది. అక్కడ కూడా బాలయ్య కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇది వరకు ఓవర్సీస్ లో బాలయ్యకు అంత గ్రిప్ లేదు. సింహా సినిమా కూడా అక్కడేం అద్భుతాలు సృష్టించలేదు. కానీ లెజెండ్ మాత్రం భారీ వసూళ్లు మూటగట్టుకొంటోంది. తొలి మూడు రోజుల్లో ఇంచుమించుగా కోటి రూపాయలు వసూలు చేసినట్టు టాక్. బాలయ్య కెరీర్ లో ఓవర్సీస్ లో ఇంత మొత్తం దక్కించుకోవడం ఓ రికార్డ్. సాధారణంగా ఓవర్సీస్ లో వినోదాత్మక చిత్రాలకే ఆదరణ ఉంటుంది. హింస, రక్తపాతం ఎక్కువగా ఉంటే.. థియేటర్లకు వెళ్లడానికి భయపడతారు. అలాంటిది బాలయ్య సినిమాకి బ్రహ్మారథం పడుతున్నారు. ఈ ఊపు మరో వారం రోజులు కొనసాగితే… ఓవర్సీస్ లోనూ బాలయ్య రికార్డ్ సెట్ చేసినట్టే.