రూ.50 కోట్లు క‌ష్టమేనా??

legend
లెజెండ్ ఊపు త‌గ్గిందా?? ఈ సినిమా వ‌సూళ్లు మంద‌గించాయా? రూ.50 కోట్ల క్లబ్‌లో చేర‌డం క‌ష్టమేనా?? ఔన‌నే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. తొలి ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.26 కోట్లు వ‌సూలు చేసింది. బిసీలో ఓ మాదిరిగా ఉన్న వ‌సూళ్లు ఏ సెంట‌ర్‌లో మాత్రం పూర్తిగా మంద‌గించాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల ప్రకారం ఏ సినిమా అయినా స‌రే.. తొలి మూడు రోజుల్లోనే వ‌సూలు చేసుకోవాలి. ఆ త‌ర‌వాత థియేట‌ర్లో మ‌నుగ‌డ సాగించ‌డం క‌ష్టమే. లెజెండ్ ప‌రిస్థితి కూడా ఇలానే క‌నిపిస్తోంది. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ దూర‌మ‌వ్వడం ప్రధాన లోపం. వాళ్లు కూడా క‌లిసొస్తే.. అవ‌లీల‌గా రూ.50 కోట్ల మార్క్ చేరుకొనేది. కానీ ఇప్పుడు ఆ అవ‌కాశం లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రేపు విడుద‌ల కాబోతున్న రౌడీ బాగుంటే… లెజెండ్ ఇంకాస్త డ్రాప్ అవుతుంది. వ‌చ్చే వారం ఎలాగూ రేసుగుర్రం వ‌స్తుంది. ఈలోగానే ఎన్నో కొన్ని వ‌సూళ్లు ద‌క్కించుకోవాలి.