Site icon TeluguMirchi.com

వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైల‌ర్

ప‌దవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా ల‌క్ష్మి పార్వ‌తి చేయి వ‌ద‌ల‌ని ఎన్టీఆర్ ప్రేమ‌, అనే క‌థ ను వాలంటైన్స్ డే సంద‌ర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ రూపం లో ఒక బండరాయి విసరబోతున్నాడు ఆర్జీవి.. “ఇది కుటుంబ కుట్ర‌ల చిత్రం” అనే ట్యాగ్ లైన్ తో రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియా లో ట్రెండ్ అవ్వటమే కాదు..చాలామంది లో చెమటలు పుట్టిస్తోంది.

ఈ క‌థ‌ను ముందెన్నడూ వ‌ర్మ చూడని విధానం,తీయని విధానంలో ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు.

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య దైవంగా, తెలుగు ఖ్యాతిని న‌లుదిశ‌లా చేర‌వేసిన ఎన్టీఆర్ లోలోపలి లోని ఒక నిర్వీర్యమైన ప్రేమ‌క‌థ‌ను “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ “లో ఆవిష్క‌రించ‌బోతున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. తుది శ్వాస వ‌ద‌లే వ‌ర‌కూ ల‌క్ష్మీ పార్వ‌తి తన గౌర‌వాన్ని కాపాడిన ఎన్టీఆర్ జీవితం పై ఆమె ఎలాంటి ప్ర‌భావం చూపించలేదు..? లక్ష్మీ కోసం తన అన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, ల‌క్ష్మీ పార్వ‌తి ల మ‌ద్య అతి రహస్య సంబంధం ఏంటి? విడ‌దీయ‌రాని ఆ ఆపవిత్ర బంధం ఎంటి..? ఇలాంటి అంశాలు కొంద‌రికి రుచించ‌క‌పోయినా, అవి తెలుగుప్ర‌జ‌ల‌ గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది కనుకనే ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’
ఆయన కుటుంబ స‌భ్యుల‌కు, న‌మ్మ‌కంగా లేని అనుచ‌రుల‌కు, వెన్నుపోటుపొడిచిన కుట్ర దారుల‌కు లక్ష్మీస్ ఎన్టీఆర్ ముందుపోటు లా ఉంటుంది.

రాంగోపాల్ వ‌ర్మ చెప్ప‌బోయే ఈ క‌థ ,ఎన్టీఆర్ మంచి విషయాలే కాదు, తన సొంత ఫ్యామిలీ వాళ్ళు చేసిన చెప్పుకోలేని పనులను కూడా అడ్డుకోలేని ఎన్టీఆర్ అమాయకత్వాన్ని చూపెట్టబోతోంది. అందుకే ఈ క‌థ నిజాల‌నే కత్తులతో మూకుమ్మడి దాడి చేయబోతోంది..తెలిసిన క‌థ‌లో తెలియ‌ని కథనాన్ని వెలికితీయ‌బోతుంది. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ అస‌లు క‌థ తెలుగు తెర‌పై లక్ష్మీ ఆటం బాంబులను పేల్చడానికి సిద్దం అవుతోంది.వెలుగులు పంచిన వ్య‌క్తి చుట్టూ అలుముకున్న చీక‌ట్ల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నాడు వ‌ర్మ‌.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలిపే ట్రైలర్ ను ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు చాలా మంది వీపులలో గుచ్చబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ.

ఎ జివి ఆర్జీవి ఫిల్మ్స్ ప్రెజెంట్స్

దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
ప్రొడ్యూసర్ :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : రమ్మీ
రచన : రాం గోపాల్ వర్మ&నరేంద్ర చారి
మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
ఎడిటర్ : కమల్ ఆర్
కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
లిరిక్స్ : సిరా శ్రీ
పి ఆర్ ఓ : జీ ఎస్ కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
సౌండ్ డిజైన్ : యతి రాజు

Exit mobile version